యాంగ్జీ నది ఉగ్రరూపంతో చైనా గజగజ - చైనా వరదలు 2020
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8481726-799-8481726-1597847256338.jpg)
చైనాలోని యాంగ్జీ నదిలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో నైరుతి ప్రాంతంలోని ఛాంగ్ఖింగ్కు భారీగా వరద నీరు చేరుకుంది. 1981 అనంతరం ఈ స్థాయిలో వరద నీరు ప్రవహరించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఛాంగ్ఖింగ్తో పాటు పరిసర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరద ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటివరకు 1,28,000మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు చేర్చారు. మరోవైపు హుబే రాష్ట్రంలో యాంగ్జీ నదిపై కట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ స్టేషన్ ఉన్న '3 గోర్జెస్ డ్యామ్'లోకి తొలిసారిగా భారీ స్థాయిలో వరద నీరు చేరుకోనుంది.