అమర జవాన్లకు సైకత శిల్పంతో ఘననివాళి - సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్
🎬 Watch Now: Feature Video
తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు దేశమంతా ఘనంగా నివాళులర్పిస్తోంది. కాగా ప్రసిద్ధ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఇసుకతో వీర సైనికుల బొమ్మలను రూపొందించి... 'ట్రిబ్యూట్ టు అవర్ బ్రేవ్‌హార్ట్స్' అంటూ తనదైన రీతిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమయంలో దేశ ప్రజలు ఏకం కావాలని, ప్రభుత్వానికి, సైనికులకు సహకరించాలని సందేశమిచ్చారు పట్నాయక్.