చుట్టూ వరద నీరు.. చెట్టుకొమ్మపై వ్యక్తి.. చివరకు... - మామిడి చెట్టుపై వ్యక్తి
🎬 Watch Now: Feature Video
వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక శాఖ(Fire Department) సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన ఒడిశా నయాగఢ్ జిల్లాలో(Odisha Nayagarh News) జరిగింది. నువాసాహస్పుర్ గ్రామానికి చెందిన కిశోర్ చంద్ర ప్రధాన్.. కుసుమీ నదిలో(Kusumi River) చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే.. ఆకస్మాత్తుగా ఆ నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. దాంతో కిశోర్ స్నేహితులు వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, కిశోర్ అక్కడే చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న మామిడి చెట్టు కొమ్మపై కూర్చొని ఉండిపోయాడు. అనంతరం... అతని స్నేహితులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. అతణ్ని రక్షించి, ఒడ్డుకు చేర్చారు.