Modi lunch: కార్మికుల మధ్య కూర్చొని భోజనం చేసిన మోదీ - కాశీ విశ్వనాథ్ కారిడార్
🎬 Watch Now: Feature Video
Modi lunch: కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ లంచ్ చేశారు. సాధారణ పౌరుడిలానే వాళ్ల మధ్య కూర్చొని ప్రధాని భోజనం చేయడం విశేషం. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ వెంట ఉన్నారు. ఆ తర్వాత.. ఇద్దరు బోటులో విహరించారు. నడవా పనులను పరిశీలించారు. అంతకుముందు కార్మికులపై పూలవర్షం కురిపించిన మోదీ.. వారితో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు.