వీడియోకు పోజులిస్తుండగా.. రైలు ఢీకొని యువకుడు మృతి - హోశంగాబాద్ న్యూస్
🎬 Watch Now: Feature Video
కొన్ని కొన్నిసార్లు సరదా పనులే ప్రాణాల మీదకు తెస్తుంటాయి. మధ్యప్రదేశ్ హోశంగాబాద్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇటార్సీ-నాగ్‌పుర్ మార్గంలో యువకుడు పట్టాలపై రైలు వస్తుండగా వీడియో తీయమని స్నేహితుడికి చెప్పాడు. అయితే రైలు మరీ దగ్గరగా వచ్చినా పట్టించుకోలేదు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శరద్‌దేవ్ ఆలయ దర్శనానికి వెళ్లిన వీరు పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మృతుడిని పంజార కలా గ్రామానికి చెందిన సంజూ చౌరేగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, అతని స్నేహితుడు, కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేందుకు స్నేహితుడితో కలిసి వీడియో తీస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.