గర్భంతో ఉన్న పైథాన్​ కోసం ప్రత్యేక గది- 11 పిల్లలు జననం - పైథాన్​ గుడ్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2021, 2:20 PM IST

ఛత్తీస్​గఢ్​ కోర్బా జిల్లా కేంద్రంలో ఓ భారీ పైథాన్​ను అటవీ శాఖ సిబ్బంది 2 నెలల పాటు సురక్షితంగా చూసుకున్నారు. దాని కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి.. గుడ్లు పొదిగేలా సౌకర్యాలు కల్పించారు. ఈ ఏడాది మే 27న సోహగ్​పుర్​ గ్రామం నుంచి ఆడ పైథాన్​ను, దాని 14 గుడ్లను రక్షించి.. జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి తీసుకొచ్చారు రెస్క్యూ సిబ్బంది. 67 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకున్నారు. 14 గుడ్లలో 11 పిల్లలుగా మారాయి. భారీ కొండచిలువను రెండు నెలలకుపైగా చూసుకోవటం సవాల్​తో కూడుకున్నదని అటవీ శాఖ రెస్క్యూ బృందం హెడ్​ జితెంద్ర సరతి తెలిపారు. ప్రస్తుతం వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.