యువకుడి జుట్టు కత్తిరించి మరీ దాడి వీడియో వైరల్ - జైసల్మేర్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు మరో యువకుడి జుట్టును కత్తిరించి తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన జైసల్మేర్ జిల్లా మోహన్గఢ్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆ యువకుడిపై ఎందుకు దాడి చేశారన్నది తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై బాధితుడి బంధువులు మోహన్గఢ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST