స్పైస్​జెట్​ విమానంలో ప్రయాణికుడి వికృత చేష్టలు.. దించేసి వెళ్లిన సిబ్బంది - స్పైస్​జెట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 24, 2023, 9:23 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

విమానాల్లో ఇటీవల తరచూ అనుచిత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన విమానంలో ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అనుచితంగా ప్రయాణించడం పాటు విమాన సిబ్బందిని వేధించినట్లు స్పైస్ జెట్ విమానయాన సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్ తో పాటు భద్రతా సిబ్బందికి తెలియజేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఫలితంగా ఆ వ్యక్తితోపాటు ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని విమానం నుంచి దించినట్లు పేర్కొంది. అనంతరం వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. విమానాల్లో అనుచిత ఘటనలు జరిగినప్పుడు తెలియజేయాలని ఇటీవల DGCA ఆదేశించిన నేపథ్యంలో స్పైస్ జెట్ ఈ విషయాన్ని బయటపెట్టింది. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.