ETV Bharat / business

'ఫ్యామిలీ తర్వాతే ఏదైనా'- వారానికి 90గంటల వర్క్​పై 78%మంది ఇదే మాట! - WORK HOURS SURVEY

వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ- భారతీయులపై సర్వే- కుటుంబానికి ఎక్కువ మంది ప్రాధాన్యం

Work Hours Survey Reports
Work Hours Survey Reports (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 6:52 AM IST

Updated : Jan 29, 2025, 8:17 AM IST

Work Hours Survey Reports : వారానికి 72 గంటలు- వారానికి 90 గంటలు అంటూ పని వేళలపై కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీన్ని ఖండించే వాళ్లతో పాటు సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఉద్యోగులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఓ సర్వే సంస్థ. ఇందులో 78 శాతం మంది భారతీయులు కుటుంబమే తమకు ప్రాధాన్యమని పేర్కొనడం గమనార్హం. దాని తర్వాతే ఏదైనా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రముఖ జాబ్‌సైట్‌ ఇండీడ్‌ ఫ్యూచర్‌ కెరీర్‌ రిజల్యూషన్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఐదుగురిలో నలుగురు (78 శాతం) కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇండీడ్‌ తెలిపింది. 2025 కెరీర్‌లో రాణించడం కంటే భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో గడపడానికే అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. తక్కవ పని ఒత్తిడి ఉండేలా చూసుకోవడం సహా మానసిక ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ఉద్యోగులు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయన్న ఆశాభావాన్ని ఇదే సర్వేలో పలువురు వ్యక్తం చేశారు.

2024 డిసెంబర్‌ నుంచి 2025 జనవరి మధ్య భారత్‌ సహా జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో ఇండీడ్‌ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో భారత్‌ నుంచి 2507 మంది సర్వేలో పాల్గొన్నారు. భారతీయ ఉద్యోగుల్లో పని, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతూకం కోరుకునే వారి సంఖ్య పెరుగుతోందని ఇండీడ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రాచెల్‌ టౌన్స్లీ పేర్కొన్నారు. అంతేకాదు ఎక్కువ సంపాదించడం ముఖ్యమే అయినా జీవితంలో ఎదగడమనేది నిచ్చెనమెట్లు కాదని చాలా మంది భావిస్తున్నారని చెప్పారు. భద్రత, పనికి సరైన వేతనం, ఇతర ప్రయోజనాలు వంటివి కూడా చూస్తున్నారని తెలిపారు.

ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చూసి ఆశ్చర్యానికి గురయ్యానంటూ బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆమె ఓ పోస్టు పెడుతూ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తు చేశారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.

Last Updated : Jan 29, 2025, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.