ఆడపిల్ల పుట్టిందని వేడుక ఆస్పత్రి నుంచి ఇంటివరకు రథంలో ఊరేగింపు - new born welcomed on chariot
🎬 Watch Now: Feature Video
ఆడపిల్లల్ని పురిటిలోనే చంపేస్తున్న తరుణంలో ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలించింది. ఆడపిల్ల పుట్టిందని రథంపై ఊరేగించారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన సాగర్, జాన్వి దంపతులు రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పసిపాపను రథంపై ఇంటికి తీసుకెళ్లారు. బ్యాండు భాజాలతో, బంధువుల కోలాహలం మధ్య ఊరేగించారు. కాగా, తాము ఎప్పుడూ ఆడపిల్లలను తక్కువ చేసి చూడలేదు అన్నారు. ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని తాము నమ్ముతామన్నారు. తమ కుటుంబం పేరు నిలబెడుతుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. ఆడపిల్ల పుట్టడం వల్ల తమ సంతోషం రెట్టింపు అయ్యిందని తెలిపారు. ఆడపిల్లైనా, మగపిల్లగాడైనా అది దేవుడి బహుమతి అని తాము భావిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు మగ పిల్లలు పుడితే వేడుక చేసుకునేవారు కానీ ఆడపిల్ల పుట్టినా దాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని, పిలుపునిచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST