బైక్​ స్పీడో మీటర్​లోకి దూరిన పాము - హీరోహోండా బైక్​లో పాము

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2022, 8:04 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

మధ్యప్రదేశ్​లో వేర్వేరు ఘటనల్లో రెండు పాములు కలకలం సృష్టించాయి. నర్​సింగ్​పుర్​ జిల్లాలో ఓ వ్యక్తి బైక్​ స్పీడో మీటర్​లో​ పాము ఇరుక్కుపోయింది. బర్​హతా ప్రాంతంలోని నజీర్​ ఖాన్​ అనే వ్యక్తి రోజులాగే తన బైక్​ని స్టార్ట్​ చేయడానికి ప్రయత్నించగా పాము బుసలు కొట్టిన శబ్ధం వినిపించింది. బైక్​ని పూర్తిగా గమనించిన యువకుడు​ స్పీడోమీటర్​లో ఉన్న పామును గుర్తించాడు. గ్రామస్థుల సహాయంతో గ్లాస్​ పగులకొట్టి పామును సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. మరో ఘటనలో మంద్​సౌర్​ ప్రాంతంలోని ఓ పంట పొలంలో సోయాబీన్​ని కోస్తున్న రైతులకు కొండచిలువ కనిపించింది. పామును చూసి రైతులు హడలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు 12 అడుగుల పొడవున్న కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.