పేకమేడలా కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్ - దిల్లీ వార్తలు
🎬 Watch Now: Feature Video
దిల్లీలోని శాస్త్రీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో భవనంలో పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించిన యజమాని ఇళ్లు ఖాళీ చేశారు. అనంతరం భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ అధికారులు ఇంటిని నేలమట్టం చేయాలని నోటీసులిచ్చారు. సోమవారం ఉదయం భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక బృందం పరిస్థితిని సమీక్షించింది.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST