భూమిలో నుంచి ఎగసిపడ్డ మంటలు భయంతో స్థానికుల పరుగు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 20, 2022, 8:32 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

ఝార్ఖండ్ ధన్​బాద్​లో భూమిలో నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సిజువా ప్రాంతంలోని బసుదేవ్​పుర్ బస్తీలో భారీ శబ్దాలతో ఓ గొయ్యిలో నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఘటనాస్థలికి వంద మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలంతా భయంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. కాగా, సమీపంలోనే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అనే కంపెనీ ఓ మైనింగ్ ప్రాజెక్టు చేపడుతోంది. ఈ ఘటన గురించి తెలుసుకొని సంస్థ అధికారులు ఆ ప్రాంతానికి హుటాహుటిన వచ్చి పరిస్థితిని సమీక్షించారు. జేసీబీల సాయంతో ఆ ప్రాంతం గొయ్యిని పూడ్చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. ​ పైప్​లైన్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే, స్థానికులు మాత్రం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తాము భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని వాపోయారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.