వాకింగ్‌కు రాలేదని కుక్కను బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన యజమాని - బిహార్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఎవరైనా పెంపుడు జంతువులను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అవి చేసే అల్లరిని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. కానీ వాటిని ఇబ్బంది పెట్టరు. కానీ బిహార్ గయాలోని ఓ వ్యక్తి మాత్రం అమానవీయంగా ప్రవర్తించాడు. తన పెంపుడు శునకం ఉదయం వాకింగ్‌కు నిరాకరించడం వల్ల తీవ్ర కోపం తెచ్చుకున్నాడు యజమాని. ఆ శునకాన్ని గొలుసుతో తన బైక్‌కు కట్టి కొన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. దీంతో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. శునకం రక్తపు మడుగులో నిండిపోయింది. రోడ్డుపై వెళ్తున్న సదరు వ్యక్తి వీడియో తీసి ప్రశ్నించాడు. ఈ ఘటన గయాలోని గాంధీ మైదాన్ సమీపంలో జరిగింది. యజమానిపై జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.