శ్రీకృష్ణుడిని పెళ్లాడిన 55 ఏళ్ల మహిళ- కారణం ఇదేనట! - 55 YEARS LADY MARRIED SHRI KRISHNA
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2024, 3:47 PM IST
55 Years Lady Married Shri Krishna : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన ఓ మహిళ (55) చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బంధువులు భారీగా హాజరయ్యారు. విందు భోజనాన్ని ఆరగించి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే కానుకలను అందించారు.
చిన్నప్పటి నుంచి కృష్ణయ్య అంటే భక్తి
హల్ద్వానీకి చెందిన భావనకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. 30ఏళ్ల పాటు కన్నయ్యకు సేవకురాలిగా భావన ఉండిపోయింది. ఆ తర్వాత తాను ఆరాధిస్తున్న కృష్ణుణ్నే చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బంధుమిత్రుల సమక్షంలో కన్నయ్యను పెళ్లాడింది. కృష్ణుడిని పట్టుకుని ఏడు అడుగులు వేసింది.
పెళ్లి కుమార్తె ఇంటికి కన్నయ్య!
శ్రీకృష్ణుడు పెళ్లి ఊరేగింపుతో పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్నాడు. అనంతరం పంచేశ్వరాలయంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. భావన తల్లిదండ్రులు మరణించడం వల్ల ఆమె సోదరులు పెళ్లి పనులను చూసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు.