How to Download SADAREM Certificate by Online : శారీరక వైకల్యం, మానసిక లోపాలు, దృష్టి లోపం.. ఇలా శారీరక లోపాలతో బాధపడే వారి వైకల్యాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం అందించేదే సదరం సర్టిఫికెట్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం ఈ ధ్రువపత్రాలను అధికారులు అందిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి.. ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది.
అయితే.. పలు కారణాల వల్ల ఈ సర్టిఫికెట్లు పోవడమో లేదా ఎక్కడో పెట్టి మర్చిపోవడమో లేదా ధ్వంసం కావడమో జరగొచ్చు. దీంతో ఈ సర్టిఫికెట్ వల్ల పొందాల్సిన ప్రయోజనాలను పొందలేరు. కోల్పోయిన సర్టిఫికెట్‌ను ఎలా పొందాలో తెలియక గతంలో లబ్ధిదారులు ఆందోళన చెందేవారు. అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం నిమిషాల్లోనే ఆన్ లైన్ ద్వారా సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సదరం ఐడీ ఎలా చెక్ చేసుకోవాలి: సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సదరం ఐడీ తెలిసి ఉంటాలి. ఒకవేళ ఆ ఐడీ గుర్తు లేకపోతే ముందుగా ఆ ఐడీ వివరాలు తెలుసుకోవాలి. అందుకోసం..
- ముందుగా తెలంగాణ సదరం పోర్టల్ విజిట్ చేయాలి. https://sadarem.telangana.gov.in/sadaremdefault.do#
- హోమ్ పేజీలో టాప్ బార్లో కనిపించే Quick Search ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీకు కొత్త పాప్అప్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో జిల్లా, మండలం, గ్రామం, మీ పేరు(సదరం సర్టిఫికెట్లో ఉన్న విధంగా) ఎంటర్ చేసి Search ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- సదరం లిస్ట్‌లో మీరు ఎంటర్ చేసిన పేరు కలిగిన వారి వివరాలు ఉంటాయి. ఆ వివరాలు చూసుకుని సదరం ఐడీని సేవ్ చేసుకోవాలి.
సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడం:
- ఫోన్ లేదా డెస్క్‌టాప్‌లో బ్రౌజర్ ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత Telangana SADAREM Certificate Print అని సెర్చ్ చేసి ఓపెన్ చేయాలి.
- మీరు అంతకుముందు సేవ్ చేసుకున్న సదరం ఐడీని ఎంటర్ చేసి Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అవి.. సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్(Click here to Download Certificate) లేదా సదరం ఐడీ(Click here to Download ID Card) కార్డ్ డౌన్లోడ్.
- అందులో మీకు కావాల్సిన ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ సర్టిఫికెట్ ఓపెన్ అవుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.
మీ టెన్త్ సర్టిఫికెట్లో స్పెల్లింగ్ తప్పు పడిందా? - ఏం చేయాలో తెలుసా?
ఇంకా బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదా? - కచ్చితంగా అవసరం - ఇలా అప్లై చేసుకోండి!