Pushpa 2 Bollywood Collections : దాదాపు రెండు వారాలుగా 'పుష్ప 2' థియేటర్లలను హోరెత్తిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో పాటు భారీ వసూళ్లను అందుకుంటోంది. ఇంకా చెప్పాలంటే తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో నెక్ట్స్ లెవల్లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్లోనూ థియేటర్లలో అదరగొడుతోంది. సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది.
అయితే ఈ 'పుష్ప 2' ఇప్పుడు కేవలం 13 రోజుల్లోనే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. సోమవారం దాదాపు రూ.582 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, మంగళవారం నాటికి రూ. 601.50 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను అందుకుంది. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతి పెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డును అందుకుంది.
ఇప్పటివరకు ఈ రికార్డు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ పేరిట ఉంది. ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్ కలెక్షన్స్ రూ.584 కోట్లు. ఆ తర్వాత రూ.627 కోట్లతో 'స్త్రీ 2' నిలిచింది. ఇప్పుడు 'పుష్ప 2' కేవలం 13 రోజుల్లోనే రూ.601 కోట్ల మార్క్‌కు చేరువైంది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. రెండో వారం వర్కింగ్ డే మంగళవారం నాడు రూ. 19.50 కోట్ల నెట్ అందుకున్న సినిమాగానూ పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డును తన పేరిట నమోదు చేసింది.
కాగా, 2021లో విడుదలైన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దీనిని నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అతి తక్కువ సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమాగా ఖ్యాతి గడించింది.
లైఫ్ పార్ట్నర్ గురించి రష్మిక కామెంట్స్- అలా ఉండే వాడు కావాలట!
ప్రెగ్నెన్సీ అని తెలిసి చాలా కంగారు పడ్డా - సరిగ్గా నిద్ర కూడా లేదు : రాధికా ఆప్టే