Ind vs Eng 1st T20 : స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 12.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. అభిషేక్ శర్మ (79 పరుగులు, 34 బంతుల్లో; 5x4, 8x6) సూపర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు. తాజా విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1- 0తో ఆధిక్యం సాధించింది.
స్వల్ప లక్ష్య ఛేదనను భారత్ ఘనంగా ఆరంభించింది. సంజూ శాంసన్ (26 పరుగులు), అభిషేక్ శర్మ తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ చేశారు. దీంతో 4 ఓవర్లలోనే స్కోర్ 40 దాటింది. శాంసన్ దూకుడుగా ఆడే క్రమంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ (0) డకౌట్ అయ్యాడు. ఈ దశలో ఇంగ్లాండ్‌కు మరో ఛాన్స్ ఇవ్వకుండా అభిషేక్ బౌండరీలతో రెచ్చిపోయాడు. ఏకంగా 200+ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ఏకంగా 7 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు. విజయం ముంగిట అభిషేక్ ఔటయ్యాడు. చివర్లో తిలక్ వర్మ (19 పరుగులు), హార్దిక్ (3 పరుగులు) మ్యాచ్ పూర్తి చేశారు.
అంతకుముందు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జాస్ బట్లర్ (68 పరుగులు, 44 బంతుల్లో) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మిగతా బ్యాటర్లంతా భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. తొలుత అర్షదీప్ సింగ్ వికెట్ల వేట ప్రారంభించగా, తర్వాత వరుణ్ చక్రవర్తి బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌కే రెండు వికెట్లు కోల్పోయినా, ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో 7 ఓవర్లకే జట్టు స్కోర్ 60 దాటింది. ఇక ఎనిమిదో ఓవర్లో వరుణ్, హ్యారీ బ్రూక్ (17 పరుగులు), లివింగ్ స్టన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టాడు. వరుణ్‌కు 3 వికెట్లు దక్కగా, అర్షదీప్ , హార్దిక్ పాండ్య , అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
'సింగ్ ఈజ్ కింగ్': చరిత్ర సృష్టించిన అర్షదీప్- టీ20ల్లో ఆల్‌టైమ్ రికార్డ్
ఇంగ్లాండ్‌తో సిరీస్- సూర్య, అర్షదీప్‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు- తొలి ప్లేయర్‌గా నిలిచే ఛాన్స్!