పాత వస్తువులతో బుల్లి హెలికాప్టర్ తయారీ పెళ్లిళ్లకు అద్దెకిస్తూ సూపర్ బిజినెస్ - Colorful helicopter streets of Azamgarh
🎬 Watch Now: Feature Video
సాధారణంగా మన ఇంట్లో పనికిరాని పాత వస్తువులు ఉంటే తుక్కు కింద అమ్మేస్తు ఉంటాము. కానీ ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజమ్గఢ్ జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ మాత్రం తన దగ్గర ఉన్న ఉపయోగపడని నానో కార్‌తో ఏకంగా రోడ్డుపై నడిచే హెలికాప్టర్‌ను తయారు చేశాడు. అంతేగాక దీనిని పెళ్లి బరాత్ వంటి శుభకార్యాలకు అద్దెకు ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. కేవలం ఇంటర్ మాత్రమే చదివిన కార్పెంటర్ సల్మాన్ నూతన ఆవిష్కరణలకు ఉన్నత చదువులతో సంబంధం లేదని నిరూపించాడు. ఈ నానో హెలికాప్టర్‌కు అమర్చిన రంగురంగుల లైట్లు రాత్రి వేళ్లల్లో చూపరులను మరింతగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా వివాహ సమయాల్లో పెళ్లి కొడుకును ఊరేగించేందుకు దీనిని ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు స్థానికులు. దీని అద్దె ధరలను రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు తీసుకుంటున్నాడు. ఈ కార్ హెలికాప్టర్లో డ్రైవర్‌తో సహా నలుగురు కూర్చోవచ్చని చెబుతున్నాడు. ఈ హెలికాప్టర్‌ను తయారు చేయడానికి రూ.3 లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపాడు. ప్రస్తుతం ఈ నానో హెలికాప్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST