దుండగుల బీభత్సం బైక్​పై వచ్చి ఒకేరోజు ఆరు ప్రాంతాల్లో కాల్పులు - firing incident in bihar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2022, 10:06 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

దారిలో వెళ్తున్న వారిని టార్గెట్​ చేస్తూ కాల్పులకు తెగబడుతున్నారు బిహార్​లోని కొందరు ఆకతాయిలు. రెండు నెలల క్రితం బెగుసరాయ్​లోని జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించిన ఘటన మరువక ముందే మరోసారి ఫైరింగ్​ జరగడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సహర్సాలోని సిమ్రీ భక్తియాపుర్​లో శుక్రవారం రాత్రి బైక్​పై వచ్చిన ముగ్గురు ఆకతాయిలు కాల్పులకు పాల్పడ్డారు. వెనకే మరో బైక్​పై వచ్చిన దుండగులు సైతం కాల్పులు జరిపారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దుకాణదారులు, పాదచారులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.