'శుభ్‌మన్, నితీశ్ రాణా ఆటతీరుతో ప్రపంచం షాకవుతుంది' - డేవిడ్ హస్సీ కేకేఆర్ టీమ్
ఐపీఎల్ రెండోదశలో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆ జట్టు చీఫ్ మెంటార్ డేవిడ్ హస్సీ(David Hussey) అన్నాడు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణాల ఆటతీరుతో ప్రపంచం షాక్‌కు గురవుతుందని అభిప్రాయపడ్డాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు శుభ్‌మన్‌గిల్, నితీశ్ రాణా రాబోయే ఐపీఎల్(IPL 2021) మ్యాచ్‌ల్లో అదరగొడతారని, తమ ఆటతో అందర్నీ షాక్‌కు గురిచేస్తారని ఆ జట్టు చీఫ్ మెంటార్ డేవిడ్ హస్సీ(David Hussey KKr) ధీమా వ్యక్తం చేశాడు. తొలి దశలో పేలవంగా ఆడి ఆకట్టుకోలేకపోయిన వీరు రెండో దశలో చెలరేగుతారని అన్నాడు. కోల్‌కతా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(Royal Challengers Bangalore) తలపడనున్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు.
"వాళ్లిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లు. కోల్‌కతా జట్టు కోసం, తమ అంతర్జాతీయ కెరీర్ల కోసం అంకితభావంతో ఉన్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో తమ ఆటతో అందర్నీ షాక్‌కు గురిచేసి టీమ్‌ఇండియ భవిష్యత్ తారలుగా నిలుస్తారు. అది కేవలం ఒకటి రెండు సిరీస్‌లకే కాకుండా దశాబ్దం పాటు రాణిస్తారు’ అని హస్సీ వివరించాడు. మరోవైపు తొలి దశలో ఆకట్టుకోలేని కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈసారి కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోవాలని ఆశిస్తున్నాడు. అతడు ముందుండి జట్టును నడిపించాలి. తన నుంచి భారీ ఇన్నింగ్స్ చూడాలి. తన ప్రణాళికలతో ఆకట్టుకోవాలి. తొలి దశలో విఫలమైనా ఇప్పుడు సరైన పంథాలో జట్టును ముందుకుతీసుకెళ్లాలి."
-డేవిడ్ హస్సీ, కేకేఆర్ చీఫ్ మెంటార్
మరోవైపు పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఏడో స్థానంలో కొనసాగుతుండగా ఇప్పటికీ తమకు అవకాశాలున్నాయని అంటున్నాడు హస్సీ(David Hussey IPL team). ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్పకుండా చరిత్ర సృష్టిస్తామన్నాడు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామని, దాంతో ఇప్పుడు కూడా అలాగే దూసుకెళ్తామని వివరించాడు. అందుకు అవసరమైన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారన్నాడు. ఈ క్రమంలోనే 2014లో కోల్‌కతా వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలుపొంది టైటిల్(KKR IPL wins) సాధించినట్లు గుర్తుచేశాడు.
ఇవీ చదవండి: