LIVE : ఆరాంఘర్ - జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - CM REVANTH TO INAUGURATE FLYOVER
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2025, 4:52 PM IST
|Updated : Jan 6, 2025, 5:26 PM IST
CM Revanth To Inaugurate Flyover Live : ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూపార్కు ఎదురుగా ఈ వంతెనను ప్రారంభించారు. నగరంలోనే ఫ్లైఓవర్ రెండో అతి పెద్దది. దూర ప్రయాణం చేసే వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి. 3.9 కిలోమీటర్లు, ఆరులైన్లతో దీనిని నిర్మించారు. ఇందుకోసం ఎస్‌ఆర్‌డీపీ నిధులు 360 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భూసేకరణతో కలిపి 799 కోట్ల రూపాయలు ఖర్చైంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు జాతీయ రహదారి మీదుగా తక్కువ సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణం చేసే వాహనాలకు ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి. పాతబస్తీవాసులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాలంటే గతంలో నగరం దాటి పీవీఎన్‌ఆర్ వంతెనను ఆశ్రయించేవారు. ఇప్పుడాఅవసరం లేదు. కొత్త ఫ్లైఓవర్ మీదుగా వేగంగా వెళ్లొచ్చు. జూపార్క్ వద్ద జరుగుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లైవ్‌లో చూద్దాం.
Last Updated : Jan 6, 2025, 5:26 PM IST