ETV Bharat / state

విరాళాలు ఇస్తామంటూ వచ్చే లింకులను నమ్మకండి - ఎందుకో చెప్పిన సైబర్ క్రైమ్ పోలీసులు - CYBER CRIME IN HYDERABAD

సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు - నమ్మి సంప్రదింపులు జరిపిన వారి బ్యాంకు ఖాతాలను హ్యక్ చేస్తున్న కేటుగాళ్లు - నెలలో 5 నుంచి 6 కేసులు నమోదు

CYBER CRIMINALS IN HYDERABAD
CYBER CRIME WITH PEOPLE EMOTIONS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 5:14 PM IST

Cyber Crimes in Hyderabad : సైబర్‌ కేటుగాళ్లు ఏ అవకాశాన్ని వదలుకోవట్లేదు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రతి అంశాన్ని వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారు. పేద పిల్లలకు విద్య, విద్యార్థులకు స్కాలర్​షిప్​లు, ప్రార్థనామందిరాలకు పెద్ద మొత్తంలో విరాళాలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత వైద్యం చేస్తామంటూ సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఆకట్టుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన ఉన్నవారు నిజమని నమ్మి స్పందించి డబ్బులు పంపి నష్టపోతున్నారు.

నమ్మకం కలిగేలా : విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, ట్రస్ట్‌లు, స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయంటూ ఫోన్‌ నంబర్లకు మెసేజ్​లు, లింక్‌లు పంపుతున్నారు. వాటిని చూసి స్పందించిన వారి ఫోన్లను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాల లావాదేవీలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మొదటగా నమ్మకం కలిగించడానికి రూ.5 నుంచి 10 వేలు బాధితుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

1930 టోల్​ఫ్రీ నంబరు : పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ముందుగా ట్యాక్స్​ చెల్లించాలంటూ రూ.లక్షలు కొట్టేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసులు 5 నుంచి 6 కేసులు నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేరిట వచ్చే లింక్‌లు, సేవ, విరాళాల పేరిట వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు నష్టపోయిన బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

సాయం చేస్తామని మోసం : విదేశాల్లో ఉన్న తమ వర్గానికి చెందిన ప్రజలకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలోని పోస్టు ఒక యువకుడిని ఆకట్టుకుంది. అవతలి వారిని యాప్‌ ద్వారా సంప్రదించి వివరాలు అడిగి సేకరించాడు. తన సహకారంతో నిధులు సేకరించి, వారు సూచించిన బ్యాంకు ఖాతాలో వేశాడు. ఆ తరువాత నిజం తెలియటంతో మోసపోయానని గ్రహించాడు.

పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేశాడు. ప్రార్థనామందిరం నిర్మాణానికి తాము ఆర్థిక సాయం చేస్తామని మాయగాళ్లు చెప్పటంతో అది నిజమని భావించాడు. బ్యాంకు ఖాతా వివరాలు పరిశీలించేందుకు కొంత నగదును జమ చేయాలంటూ దశల వారీగా రూ.లక్షా 50వేలు కొట్టేశారు. అనంతరం వారు స్పందించకపోవడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నయా స్కామ్​- మీ అకౌంట్​లో ఫ్రీగా రూ.5వేలు డిపాజిట్​- ఆనందంతో క్లిక్ చేస్తే అంతా ఖాళీ!

న్యూఇయర్ విషెస్​​ అంటూ లింక్స్​ వస్తున్నాయా? - ఇప్పుడు ఇదే​ సైబర్​ నేరగాళ్ల కొత్త ట్రిక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.