ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైస్ షర్మిల బాధ్యతల స్వీకరణ - ప్రత్యక్ష ప్రసారం - APPCC
🎬 Watch Now: Feature Video
Published : Jan 21, 2024, 2:41 PM IST
YS Sharmila PCC Oath Live : దివంగత ముఖ్యమంత్రి కుమార్తె వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారం కోసం విజయవాడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆమె ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయానికి బయలు దేరారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరనున్నారు. ఆమెతో పాటు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజనాథ్, తులసి రెడ్డిలు ఉన్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
ఆదివారం షర్మిల ప్రమాణ స్వీకార దృష్ట్యా ఆమె శనివారమే ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. శనివారం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప బయలుదేరి వెళ్లారు. ఆమెతో పాటు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి కూడా కడపకు వెళ్లారు. కడప నుంచి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పించారు.