సీఎం కార్యక్రమంలో స్టాఫ్ నర్సుల ఆందోళన - రెగ్యులర్ చేయాలని డిమాండ్ - Staff Nurse Protest For Regularize
🎬 Watch Now: Feature Video


Published : Jan 31, 2024, 5:26 PM IST
Tims Hospital Staff Nurse Protest at LB Stadium : హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదుట గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆందోళ చేశారు. తమకు 20 శాతం వెయిటేజ్ మార్కులు ఇచ్చి, రెగ్యులర్ చేయాలని ప్లకార్డులతో నర్సులు నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 6956 స్టాఫ్ నర్సులకు సంబంధించిన నియామక పత్రాలు అందజేస్తుండగా, కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు(Contract Staff Nurse) ఆందోళన చేపట్టారు.
Staff Nurse Protest For Regularize at LB Stadium : స్టాఫ్ నర్సులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో నర్సులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి, నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో నర్సులకు పోలీసులకు తోపులాట జరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కాసేపు ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.