LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - TSLegislative Council Sessions 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 14, 2024, 10:09 AM IST
|Updated : Feb 14, 2024, 3:46 PM IST
Telangana Legislative Council Sessions Live : తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ఇవాళ శాసనమండలిలో చర్చ జరగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. జులై నెల వరకు అవసరాల కోసం రూ.78,911 కోట్ల వినియోగం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రతిపాదించారు. దానిపై నేడు మండలిలో చర్చ జరగుతోంది. చర్చతో పాటు ప్రభుత్వ సమాధానం కూడా ఇవాళ్టి ఎజెండాలో పొందుపరిచారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ వ్యయంపై చర్చ జరగనుంది. అవసరమైతే నీటిపారుదల, కృష్ణా జలాల అంశంపై కూడా శాసనసభలో చర్చ జరిగే అవకాశం ఉంది.