LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - Tg Legislative Council sessions - TG LEGISLATIVE COUNCIL SESSIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 10:04 AM IST

Updated : Jul 24, 2024, 12:10 PM IST

Telangana Legislative Council Sessions 2024 Live : తెలంగాణ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో మొదటిగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్​ మృతిపై శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి సంతాప తీర్మానం చదివి వినిపించనున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాలు, కొన్ని టేబుల్​ అంశాలు సభలో ఉండనున్నాయి. ఈనెల 25  బడ్జెట్​. 26న సెలవు. 27న బడ్జెట్​పై చర్చ సమాధానం 28,29,30 తేదీల్లో సెలవు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.మంగళవారం మండలి ఆవరణలో ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఛాంబర్‌లో నిర్వహించిన బీఏసీ సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్, బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్సీ మహమూద్‌ అలీ, బీజేపీ తరఫున ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెలలో బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. వారు శాసనమండలిలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
Last Updated : Jul 24, 2024, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.