LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - TS Legislative Council Sessions 24

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 10:08 AM IST

Updated : Feb 12, 2024, 12:25 PM IST

Telangana Legislative Council Sessions Live : తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్​ అకౌంట్‌ పద్దును ప్రవేశపెట్టారు. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్న ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందరికోసం స్ఫూర్తితో పాలన అందిస్తున్నామని తెలిపారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. మేడిపండు లాంటి బడ్జెట్​ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, తెలంగాణలో ఇలాంటి బడ్జెట్​ను ఇంతవరకు ఎన్నడూ చూడలేదని  విమర్శించారు. బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, ఈ ప్రభుత్వం నేమ్ ఛేంజర్​ మాత్రమేనని, గేమ్​ ఛేెంజర్​ కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే, కాంగ్రెస్ పాలన అంకెల గారడీతో పాటు మాటల గారడీ అని బీజేపీ ఆరోపించింది. తాజాగా నేడు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Last Updated : Feb 12, 2024, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.