LIVE : అసెంబ్లీ పాయింట్ మీడియా వద్ద మాట్లాడుతున్న హరీశ్​రావు - ప్రత్యక్షప్రసారం - Telangana Legislative meetings live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 10:51 AM IST

Harishrao assembly point media conference Live : అసెంబ్లీ పాయింట్ మీడియా వద్ద మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతున్నారు. అంతకుముందు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగాయి. ఇవాళ ప్రజాప్రతినిధులు మేడిగడ్డ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ కలిసి బస్సులలో మేడిగడ్డ ప్రాజెక్ట్​ దగ్గరకు చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వద్దకు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు చేరుకున్నారు. అనంతరం 10.15కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి మేడిగడ్డకు బస్సుల్లో బయల్దేరారు.

మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​ దగ్గరకు ప్రజా ప్రతినిధుల బృందం చేరుకుంటారు. అనంతరం 2 గంటల పాటు సైట్ విజిట్ చేస్తారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అది ముగిసిన తరవాత 5 గంటలకు తిరిగి హైదరాబాద్​కు చేరుకోనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు సందర్శన ఉన్నందున మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీనికి సర్వం సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.