LIVE : తెలంగాణ శాసనసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Telangana Budget sessions 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 12, 2024, 10:05 AM IST
|Updated : Feb 12, 2024, 4:16 PM IST
Telangana Assembly Sessions Live : తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్న ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందరికోసం స్ఫూర్తితో పాలన అందిస్తున్నామని తెలిపారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. మేడిపండు లాంటి బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, తెలంగాణలో ఇలాంటి బడ్జెట్‌ను ఇంతవరకు ఎన్నడూ చూడలేదని విమర్శించారు. బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, ఈ ప్రభుత్వం నేమ్ ఛేంజర్ మాత్రమేనని, గేమ్ ఛేెంజర్ కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే, కాంగ్రెస్ పాలన అంకెల గారడీతో పాటు మాటల గారడీ అని బీజేపీ ఆరోపించింది. తాజాగా నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.