బ్రిడ్జిపై ఒకేసారి ఐదు వాహనాలు ఢీ- ముగ్గురు సజీవ దహనం - lorry accident in tamil nadu

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 10:57 PM IST

Tamil Nadu Road Accident Today : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ వంతెనపై అదుపుతప్పి రెండు కార్లు సహా మరో రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహన మయ్యారు. ప్రమాదానికి కారణమైన లారీ బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. ఈ క్రమంలో కార్లన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇదీ జరిగింది
తోపుర్​ కనుమ ప్రాంతంలో ధర్మపురి నుంచి సేలం వైపు వరి బస్తాలతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న రెండు కార్లు, రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న తోపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా సేలం- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, సహాయక చర్యలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.