కొత్త బైక్ రూ.90వేలు- ఊరేగింపుగా ఇంటికి తెచ్చేందుకు ఎక్స్ట్రా రూ.60వేలు ఖర్చు - CHAIWALA BUY NEW VEHICLE
🎬 Watch Now: Feature Video
Published : Oct 14, 2024, 3:15 PM IST
Chaiwala Buy New Vehicle In Unique Way : రూ.90 వేలు విలువైన కొత్త బండిని ఇంటికి తెచ్చేందుకు అదనంగా రూ.60 వేలను ఖర్చు చేశాడు ఓ చాయ్‌వాలా. మోపెడ్ బైక్‌ను కొనుగోలు చేసేందుకు షోరూమ్‌కు క్రేన్, బగ్గీ, డీజేతో వచ్చాడు. ప్రసుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్పురీ జిల్లాలో జరిగింది.
నాగ్‌పుర్‌కు చెందిన మురారీ లాల్ కుష్వాహా అనే వ్యక్తి టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తన కుమార్తెతో కలిసి మోపెడ్ బైక్‌ను కొనుగోలు చేసేందుకు షోరూమ్‌కు వెళ్లాడు. మురారి తనతో పాటు షోరూమ్‌కు క్రేన్, బగ్గీ, డీజే, డ్యాన్స్ చేసేవాళ్లను కూడా తీసుకెళ్లాడు. రూ.90 వేలు విలువైన బైక్‌ను రూ.20 వేలు డౌన్ పేమెంట్ చేసి ఈఎంఐలో కొనుగోలు చేశాడు. అయితే దానిని ఇంటికి తీసుకెళ్లేందుకు మాత్రం రూ.60 వేలు ఖర్చు చేశాడు. క్రేన్‌తో కొత్త బండిని డీజే డ్యాన్స్‌లతో తన ఇంటికి తీసుకెళ్లాడు. తన కుమార్తె ఆనందం కోసమే ఇలా చేశానని మురారి అంటున్నాడు. ట్విస్ట్ ఏమిటంటే అనుమతి లేకుండా ఇదంతా చేసినందుకు పోలీసులు బగ్గీని, డీజేను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ వాల్యూమ్‌తో డీజేను ప్లే చేసినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అయితే మురారి ఇలా చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో కూడా తన కూతురికి మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు కూడా ఇలానే చేశాడు. రూ.12,500 కొనుగోలు చేసిన మొబైల్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు రూ.25 వేలు ఖర్చు చేసినట్లు మురారి చెప్పాడు. ఆ సమయంలో కూడా ట్రాలీ, బగ్గీ, డీజేతో కొత్త ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపాడు.