'ప్రభాస్‌కు అప్పుడు చాలా భయం ఉండేది - మేం అలా చేసేవాళ్లం' - HANU KOTLA THE DEAL MOVIE
🎬 Watch Now: Feature Video
Published : Oct 18, 2024, 1:45 PM IST
EESHWAR MOVIE FAME HANU KOTLA : సినీ పరిశ్రమలోకి వచ్చే నటీనటుల్లో చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం క్రికెటర్ అవుదామనుకొని నటుడు అయ్యారు. తానే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని లలిత కళల విభాగం డీన్ డాక్టర్ హను కోట్ల. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ చిత్రంతో నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన హను కోట్ల నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి నంది పురస్కారాన్ని, ప్రశంసలను అందుకున్నారు. తాజాగా దర్శకుడిగా ది డీల్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ది డీల్ చిత్రాన్ని తీర్చిదిద్దిన హను కోట్ల తన నట, దర్శకత్వ అనుభవాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు. ప్రభాస్‌తో ఈశ్వర్ షూటింగ్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 18 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.