'డబ్బు ఖర్చుపెడితేనే హుందాతనం రాదు' - డైరెక్టర్లకు చిరు సూచన - ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రీ రిలీజ్
🎬 Watch Now: Feature Video
Published : Feb 26, 2024, 4:45 PM IST
Operation Valantine Movie Chiranjeevi Speech : సినిమాల నిర్మాణంపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఖర్చుపెడితే సినిమాకు హుందాతనం రాదని, అది మన ఆలోచనల్లో ఉండాలంటూ సూచించారు. తక్కువ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించి వాటిని ఎలా రిచ్‌గా చూపిస్తే బాగుంటుందో డైరెక్టర్లు ఆలోచించాలని కోరారు. అప్పుడే నిర్మాతలు, సినీ పరిశ్రమ బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన సోదరుడు నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలంటైన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ చిత్ర నిర్మాణ విషయాలను తెలుసుకొని ఆశ్చర్యపోయారని తెలిపిన చిరు, 75 రోజుల్లోనే ఎంతో నాణ్యతగా డైరెక్టర్ ఈ ఆపరేషన్ ఈ వాలంటైన్ మూవీని రూపొందించారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజువల్స్ చూస్తుంటే తక్కువ బడ్జెట్లో అంత గొప్ప నాణ్యమైన సినిమా తీశారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శక్తిప్రతాప్ ను అభినందించిన చిరంజీవి, సినిమా నిర్మాణంలో యంగ్ డైరెక్టర్లతో శక్తిప్రతాప్ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.
లావణ్య త్రిపాఠితో లవ్ - వరుణ్ తేజ్‌పై కోపం పెంచుకున్న చిరు!
'విశ్వంభర' హీరోయిన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ - 18 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్