thumbnail

LIVE : మైసూరులో వైభవంగా దసరా ఉత్సవాలు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 1 hours ago

Mysore Dussehra Celebrations 2024 : మైసూరు అంటే ముందుగా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. శరన్నవరాత్రుల వేళ అక్కడ ఉత్సవ శోభ ఉట్టిపడుతోంది. జగన్మాత సేవ కోసం గజరాజులు సిద్ధమవుతుండగా విజయదశమి నాడు నిర్వహించే ముగింపు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మైసూరు నగరం దసరా శరన్నవరాత్రుల ముగింపు వేడుకలకు సిద్ధమైంది. విజయదశమి రోజున కనుల విందుగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. దీనికోసం మైసూరులోని రాజభవనాలు అద్భుత అలంకరణతో ముస్తాబయ్యాయి. విద్యుత్‌ కాంతులతో నగరం వెలుగులీనుతోంది. విజయదశమి రోజున జరిగే ఊరేగింపులో బంగారు ఆంబారీలో చాముండేశ్వరీ దేవీని ఊరేగించనున్నారు. 750కిలోల బరువు కలిగిన ఆ అంబారీని అభిమన్యు అనే గజరాజు మోయనుంది. సుమారు 14 ఏనుగులకు అభిమన్యు నాయకత్వం వహించనుంది. వేడుకలకు చివరిరోజు జరిగే జంబూ సవారీ ఊరేగింపునకు లక్షలాది భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుంటారు. వేడుకల్లో సంప్రదాయ క్రీడలను, సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.
Last Updated : 1 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.