మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు ప్రారంభం - ఎన్‌డీఎస్ఏ సూచనలతో ఇంజినీర్ల ముందడుగు - Medigadda Barrage Repairs Starts - MEDIGADDA BARRAGE REPAIRS STARTS
🎬 Watch Now: Feature Video
Published : May 18, 2024, 10:48 AM IST
Medigadda Barrage Repairs Starts 2024 : కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలను అధికారులు చేపట్టారు. గత సంవత్సరం అక్టోబర్ 21న 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ దెబ్బతిని, పియర్‌లో పగుళ్లు, ఆనకట్టపై వంతెన కుంగిపోవడంతో ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో బ్యారేజీకి మరింత ప్రమాదం జరగకుండా ముందస్తుగా నీటిని విడుదల చేసి, ఖాళీ చేశారు. మరోవైపు జాతీయ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం కమిటీ పలుమార్లు మేడిగడ్డను పరిశీలించి, పలు పరీక్షలు చేసి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది.
Medigadda Damage Updates : వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని జాతీయ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం కమిటీ సూచించింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం నాడు పునరుద్ధరణ చర్యలను చేపట్టారు. దెబ్బతిన్న 7వ బ్లాక్ ప్రాంతంలో 15 గేట్‌ను ఎత్తారు. ఈ గేట్‌తో పాటు దెబ్బతిన్న 19, 20 పియర్ గేట్లను కూడా పూర్తిస్థాయిలో ఎత్తనున్నట్లు తెలిసింది. దీంతో పాటు పియర్ పగుళ్లపై పలు చర్యలను తీసుకోనున్నారు.