కాటేసిన పామును మెడలో వేసుకుని ఆస్పత్రికి పరుగు- పేషంట్లు, వైద్యులు హడల్! - MAN BITE BY RUSSELL VIPER SNAKE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-10-2024/640-480-22697578-thumbnail-16x9-snake.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 17, 2024, 10:05 AM IST
Man Bite By Russell Viper Snake : బిహార్‌లోని భాగల్‌పుర్ జిల్లాలో విషపూరిత పాము కాటుకు గురైన ఓ వ్యక్తి చేసిన పని వైద్యులతోపాటు రోగులను భయాందోళనకు గురిచేసింది. తనను ఏ పాము కాటు వేసిందో వైద్యులకు చూపేందుకు, కరిచిన ఆ సర్పాన్ని ప్రకాశ్ మండల్ అనే వ్యక్తి ఆస్పత్రికి తీసుకురావడం కలకలం రేపింది.
మీరాచాక్ గ్రామానికి చెందిన ప్రకాశ్ మండల్‌కు ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపర్ ఎడమ చేతి బొటనవేలుపై బుధవారం కాటు వేసింది. వెంటనే పాము నోటిని గట్టిగా అదిమిపట్టుకున్న ప్రకాశ్, జేఎల్‌ఎన్‌ఎం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. మంచంపై ప్రకాశ్‌ను పడుకోపెట్టినా, అతడు పామును వదల్లేదు. వైద్యులు సలహా మేరకు కొందరు సాహసం చేసి ఆ పామును గోనె సంచిలో బంధించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ మండల్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యుడు ప్రతీక్ తెలిపారు.