బిందెలో ఇరుక్కున్న చిరుత తల- 5గంటలు నరకయాతన - బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల
🎬 Watch Now: Feature Video
Published : Mar 3, 2024, 8:44 PM IST
Leopard Head Stuck in Vessel : ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత తల ప్రమాదవశాత్తూ బిందెలో ఇరుక్కుపోయింది. దీంతో 5 గంటల పాటు నరకయాతన అనుభవించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది.
ఇదీ జరిగింది
ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన చిరుత, ఓ పశువుల పాకలో ఉన్న బిందెలో తల దూర్చింది. దీంతో అందులోనే చిరుత తల ఇరుక్కుపోయి అక్కడే పెనుగులాడింది. ఎంతకూ తల బయటకు రాకపోవటం వల్ల దాదాపు 5 గంటలకు పైగా బిక్కు బిక్కుమంటూ గడిపింది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పశు వైద్యుల సాయంతో చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి పంపించారు. అనంతరం మెటల్ కట్టర్‌తో బిందెను తొలగించారు. ఆ తర్వాత చిరుతను బోనులో బంధించి స్థానిక అడవిలో వదిలేశారు.