14వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన జవాన్​- కృత్రిమ కాలుతో డేరింగ్​ స్టంట్​! - Army Climbed From 14000 Ft Height - ARMY CLIMBED FROM 14000 FT HEIGHT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 2:29 PM IST

Jawan Climbed From 14000 Feet Height : ఆపరేషన్‌లో కాలు కోల్పోయినా కృత్రిమ అవయవంతో భారీ సాహసం చేశారు లెఫ్టినెంట్ కల్నల్ అవ్నీష్ బాజ్‌పాయ్. 14 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. పంజాబ్​లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌ ఈవెంట్​లో అవ్నీశ్ పారాషూట్​తో ఈ​ డేరింగ్​ స్టంట్​ను చేశారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ఆధికారులు వెల్లడించారు. అవ్నీశ్ స్టంట్ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సంకల్ప శక్తికి, అంకితభావానికి నిదర్శనం!
"లెఫ్టినెంట్ కల్నల్ అవ్నీష్ బాజ్‌పాయ్ ఓ సాహసోపేత యోధుడు, యుద్ధంలో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన వ్యక్తి, ఆపరేషన్‌లో ఒక కాలును కోల్పోయారు. కానీ ఇటీవల డేరింగ్ సవాలును స్వీకరించారు. కృత్రిమ అవయవాలతో 14,000 అడుగుల నుంచి స్కైడైవ్ చేశారు. పంజాబ్​లోని బఠిండా ఎయిర్‌బేస్‌లో జరిగిన ఈ అత్యుత్తమ స్టంట్ మానవ స్ఫూర్తికి, సంకల్ప శక్తికి, మన సాయుధ దళాల అంకితభావానికి నిదర్శనం" అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్ (ట్విట్టర్​)లో ట్వీట్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.