thumbnail

చిన్నారులను బలి తీసుకుంటున్న అమీబా - ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్తపడాల్సిందే - Interview On Brain Eating Amoeba

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 5:20 PM IST

Interview On Brain Eating Amoeba : అమీబా ఈ పేరు చెప్పగానే చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో సరైన ఆకారం లేకుండా ఉండే ఓ బొమ్మ గుర్తొస్తుంటుంది. అయితే కేరళ వాసులకు మాత్రం ఇప్పుడు ఈ పేరు చెబితే మరణశాసనంగా అనిపిస్తుంది. ఇందుకు కారణం ఇటీవల కేరళలో నెగ్లేరియా ఫౌలెరి అనే అమీబా కారణంగా ముగ్గురు చిన్నారులు బలికావటమే. సాధారణ మాటల్లో చెప్పాలంటే మెదడును తినే అమీబా. ముక్కు నుంచి మెదడులోకి ప్రవేశించే ఈ రకం అమీబా ఇన్​ఫెక్షన్ కేసులు కేరళలో నాలుగు నమోదు కాగా అందులో ఇప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో 14 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఇన్​ఫెక్షన్ సోకిన వారిలో దాదాపు 97 శాతం మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా చిన్నారుల్లోనే ఇది ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? అసలు ఈ అమీబా మనిషి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అనే అంశాలపై నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.