ఏజెన్సీ ఏరియా దాకా పోలేక ఇంట్లోనే గంజాయి సాగు మొదలెట్టాడు - POLICE SEIZE GANJA PLANTS IN HOME - POLICE SEIZE GANJA PLANTS IN HOME
🎬 Watch Now: Feature Video
Published : Oct 5, 2024, 8:49 PM IST
Police Seized Ganja Plants at Home in Nalgonda District : గంజాయి కోసం విశాఖ, ఒడిశా, ఖమ్మం ఏజెన్సీ దాకా పోవడం ఎందుకు అనుకున్నాడో, ఓ వ్యక్తి ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు ప్రారంభించాడు. తన ఇంటి ఆవరణలో పూల మొక్కలను పెంచినట్లు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా పూల మొక్కల మధ్య గంజాయి మొక్కలను పెంచాడు. మల్లేపల్లి సీఐ ధనుంజయ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండంలో బుడ్డారెడ్డిగూడెంలో సింగం ముత్యాలు అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో పూల చెట్ల మధ్య గంజాయి మొక్కలను సాగు చేశాడు.
ఈ విషయం తెలసుకున్న పోలీసులు వ్యవసాయ అధికారి సమక్షంలో ఇంటి ఆవరణలో ఉన్న ఆ మొక్కల్ని స్వాధీనం చేసుకుని గుర్రంపోడు పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తం 128 గంజాయి మొక్కలు ఉండగా సుమారు 18 కేజీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.