thumbnail

అన్నపూర్ణాదేవికి 365 రకాల నైవేద్యాలు - Shri Devi Sharan Navaratri Mahotsav

By ETV Bharat Telangana Team

Published : 1 hours ago

Dasara Navaratri Mahotsav in Mahabubabad : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించేలా అమ్మవారి అలంకరణను నిర్వాహకులు రూపొందిస్తున్నారు. 3వ రోజైన నేడు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. 

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి 365 రకాల నైవేద్యాలు సమర్పించారు. భక్తులు తమ ఇళ్లలో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి భక్తిని చాటుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి శ్రీ లలితా సహస్ర స్తోత్ర పారాయణం, మహిషాసుర మర్దినీ స్తోత్రము, లింగార్చన స్తోత్ర పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 365 రకాల నైవేద్యాలను భక్తులకు పంచిపెట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజకు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.