ధర్నాల పేరిట హరీశ్‌రావు ప్రజల్ని మభ్యపెడుతున్నారు : మహేశ్‌కుమార్ గౌడ్ - Mahesh Kumar Goud Fires on Harish - MAHESH KUMAR GOUD FIRES ON HARISH
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-10-2024/640-480-22616570-thumbnail-16x9-pcc.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 5, 2024, 10:10 PM IST
PCC President Mahesh kumar Goud on Harish Rao : ధర్నాల పేరిట మాజీమంత్రి హరీశ్‌రావు ప్రజల్ని మభ్యపెడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో రైతుల రుణాలు ఎంత మాఫీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకుపోతామని స్పష్టం చేశారు.
రామోజీరావు మరణం అత్యంత బాధకరం : విద్యార్థి నాయకుడి నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎదగడానికి మీడియా ఎంతగానో సహకరించిందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. పీసీసీ అధ్యక్షుడినయ్యాక తనను ఆశీర్వదించాలని రామోజీరావును కోరానన్న మహేశ్ కుమార్ గౌడ్, అప్పటికే ఆయన మరణించడం అత్యంత బాధాకరమన్నారు. అంతకుముందు డిచ్‌పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన డాక్టర్స్ క్వార్టర్స్‌ను ఆయన ప్రారంభించారు. సీఎస్ఐ ఆధ్వర్యంలో త్వరలో డిచ్‌పల్లిలో సీఎంసీ ఆసుపత్రిని పునరుద్ధరణకు ట్రస్ట్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.