ETV Bharat / education-and-career

ONGCలో 2,236 అప్రెంటీస్‌ పోస్టులు - రాత పరీక్ష లేకుండానే నియామకాలు - దరఖాస్తు చేసుకోండిలా! - ONGC Apprentice Recruitment 2024

ONGC Apprentice Recruitment 2024 : ఓఎన్‌జీసీ 2,236 అప్రెంటీస్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు అక్టోబర్‌ 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ONGC
ONGC (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 10:08 AM IST

ONGC Apprentice Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్' (ONGC) 2236 అప్రెంటీస్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

పోస్టుల వివరాలు

1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్

2. డిప్లొమా అప్రెంటీస్

3. ట్రేడ్ అప్రెంటీస్

సెక్టార్ల వారీగా పోస్టుల వివరాలు :

  • నార్తర్న్ సెక్టార్ - 161
  • ముంబయి సెక్టార్ - 310
  • వెస్ట్రన్ సెక్టార్ - 547
  • ఈస్ట్రన్‌ సెక్టార్ - 583
  • సదరన్ సెక్టార్ - 335
  • సెంట్రల్ సెక్టార్- 249
  • మొత్తం పోస్టులు : 2,236.

విద్యార్హతలు : అభ్యర్థులు పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌ విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్‌/ విభాగాలు : ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, ఫిట్టర్, సర్వేయర్‌, మెషినిస్ట్‌, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, స్టోర్ కీపర్

వయోపరిమితి : 2024 అక్టోబర్‌ 25 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్ : గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు నెలకు రూ.9,000. డిప్లొమా అప్రెంటీస్‌కు నెలకు రూ.8,050. ట్రేడ్ అప్రెంటీస్‌కు నెలకు రూ.7,000 - రూ.8,050 వరకు స్టైపెండ్ అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ : అడమిక్స్‌లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్‌ పోస్టులకు ఎంపిక చేస్తారు.

వర్క్ సెంటర్ : కాకినాడ, రాజమహేంద్రవరం, దిల్లీ, గోవా, ముంబయి, చెన్నై, దేహ్రాదూన్, జోధ్‌పుర్, హజీరా, ఉరాన్, పన్వెల్, నవా, అహ్మదాబాద్, అంక్లేశ్వర్, వడోదర, బొకారో, కాంబే, మెహసానా, జోర్హాట్, నజీరా & శివసాగర్, సిల్చార్, కారైకల్, అగర్తల, కోల్‌కతా.

దరఖాస్తు చేయడం ఎలా?
ONGC Apprentice Apply Online : అభ్యర్థులు ఓఎన్​జీసీ అధికారిక వెబ్​సైట్​ www.ongcindia.com లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 అక్టోబర్‌ 5
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 25
  • ఫలితాల వెల్లడి : 2024 నంబర్‌ 15

ముఖ్యాంశాలు :

  • ఓఎన్‌జీసీ 2236 అప్రెంటీస్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.