How to Make Chettinad Tomato Chutney : టిఫెన్ తినడానికైనా.. భోజనం చేయడానికైనా.. కొన్ని చట్నీలు అద్దిరిపోయేలా ఉంటాయి. అలాంటి వాటిల్లో టమాటా చట్నీ ముందు ప్లేసులో ఉంటుంది. అయితే.. ఈ టమాటా చట్నీని ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం చెట్టినాడ్ స్టైల్ టమాటా చట్నీ ప్రిపేర్ చేద్దాం. ఇది టిఫెన్ తోపాటు రైస్ లోకి కూడా సూపర్‌గా ఉంటుంది. మరి.. దీన్ని తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి? ప్రిపరేషన్ పద్ధతి ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- ఆయిల్ - టేబుల్ స్పూన్
- ఉల్లిపాయలు - అరకప్పు (సన్నగా తరుక్కోవాలి)
- వెల్లుల్లి రెబ్బలు - 10
- ఇంగువ - హాఫ్ టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- టమాటాలు - 3 సన్నగా కట్ చేసి వేయాలి.
- ఎండు మిరపకాయలు - ఆరు నుంచి ఏడు
- ఎర్ర కారం - ఒక స్పూన్ (స్పైసీ కావాల్సినదాన్ని బట్టి తగ్గించడం, పెంచడం చేయాలి)
- చింతపండు - పెద్ద సైజు నిమ్మకాయంత
తయారీ విధానం..
- ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి.
- అది వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేయాలి.
- తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
- కాసేపటి తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేయాలి.
- అనంతరం మూత పెట్టి.. టమాటా, ఉల్లిపాయ సాఫ్ట్‌గా అయ్యేంత వరకూ ఉడికించాలి
- ఇదంతా ఉడకడానికి ఐదారు నిమిషాలు పడుతుంది.. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి
- ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాలి.
- చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోని కొద్దిగా బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి.
- తర్వాత స్టౌమీద పాన్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల్ ఆయిల్ వేయండి
- వేడెక్కిన తర్వాత ఆఫ్ టీస్పూన్ ఆవాలు, ఆఫ్ స్పూన్ మినపప్పు వేయాలి.
- తర్వాత కరివేపాకు వేయాలి. కావాలంటే ఒక ఎండు మిర్చి వేసుకోవచ్చు.
- పోపు సిద్ధమైన తర్వాత ఇందులో.. మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం వేయాలి.
- రెండు నిమిషాల పాటు అటూ ఇటూ కలిపిన తర్వాత చట్నీ చక్కగా, చిక్కగా తయారవుతుంది.
- అంతే.. అద్దిరిపోయే చెట్టినాడ్ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది.
- టిఫెన్లోకి, రైస్ లోకి ఎందులోకైనా సూపర్ గా ఉంటుందీ చట్నీ. కావాలంటే.. మీరు కూడా ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
నోరూరించే రాయలసీమ స్టైల్ "పల్లీ పచ్చడి" - పదే పది నిమిషాల్లోనే అద్దిరిపోయే రుచితో రెడీ!