ETV Bharat / technology

కామో థీమ్​తో టాటా పంచ్ నయా ఎడిషన్- ప్రీమియం ఫీచర్స్​తో బడ్జెట్ ధరలో లాంచ్ - Tata Punch Camo Edition Launch

Tata Punch Camo Edition Launch: పండగ వేళ టాటా మోటార్స్ తన టాటా పంచ్ కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Tech Team

Published : 1 hours ago

Tata Punch Camo Edition Launch
Tata Punch Camo Edition Launch (Instagram/tatamotorscars)

Tata Punch Camo Edition Launch: దసరా శరన్నవరాత్రుల వేళ మార్కెట్లో మరో సరికొత్త కారు లాంచ్ అయింది. ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రసిద్ధ మినీ SUV టాటా పంచ్ లైనప్‌లో కామో ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకమైన కామో థీమ్​తో తీసుకొచ్చిన ఈ కారులో పలు ప్రీమియం ఫీచర్స్​ను పొందుపరిచినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈసారి కారును పరిమిత యూనిట్లలో మాత్రమే విక్రయించనున్నారు.

2021లో టాటా పంచ్‌ విడుదల చేసిన నాటి నుంచి కస్టమర్ల నుంచి దీనికి అద్భుతమైన స్పందన లభిస్తోందని, తాజాగా ఈ కామో ఎడిషన్‌ పంచ్‌ కూడా వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని భావిస్తున్నట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీసీఓ వివేక్‌ శ్రీవాత్సవ అన్నారు.

టాటా పంచ్ కామో ఎడిషన్ ప్రత్యేక ఫీచర్స్:

  • 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌
  • సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
  • సరికొత్త సీవీడ్‌ గ్రీన్‌ కలర్‌
  • ఆటో AC
  • వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
  • వైట్‌ రూఫ్‌
  • ఆర్‌16 చార్‌కోల్‌ గ్రే అల్లాయ్‌ వీల్స్‌
  • యాపిల్‌ కార్‌ ప్లే

భద్రతా ఫీచర్లు:

  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • EBDతో కూడిన ABS
  • రియర్ పార్కింగ్ కెమెరా
  • రియర్ పార్కింగ్ సెన్సార్స్

ఎక్స్​టీరియర్: 2024 టాటా పంచ్ కామో ఎడిషన్ సీవీడ్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ షేడ్‌లో వైట్ రూఫ్‌తో వస్తోంది. దీంతోపాటు ఇందులో 16-అంగుళాల డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్, సైడ్ ఫెండర్‌లపై 'కామో' బ్యాడ్జ్ ఉంటుంది.

ఇంటీరియర్: కారు లోపలి భాగం గురించి మాట్లాడితే టాటా పంచ్ కామో స్పెషల్ ఎడిషన్ ఆల్-బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, బ్లాక్ అవుట్ డోర్ ఓపెనింగ్ లివర్‌తో వస్తోంది. వీటితో పాటు డోర్ ప్యాడ్‌లపై కామో గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి.

టాటా పంచ్ కామో ఇంజిన్: కంపెనీ పెట్రోల్, సిఎన్‌జి ఇంజిన్ ఆప్షన్లతో టాటా పంచ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 1.2-లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. పెట్రోల్‌పై, ఈ ఇంజన్ 87 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీంతోపాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక CNG ఫ్యూయల్ గురించి చెప్పాలంటే ఈ ఇంజన్ 72 bhp పవర్, 103 Nm టార్క్‌ను అందిస్తుంది. CNG పవర్‌ట్రెయిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది.

టాటా పంచ్ కామో ఎడిషన్ ధర: రూ.6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మార్కెట్లో పోటీ: ఈ టాటా పంచ్ కామో ఎడిషన్ భారత మార్కెట్లో హ్యుందాయ్ ఎక్సెటర్‌తో నేరుగా పోటీపడుతుంది. ఈ కారు మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్​ వంటి వాటికి కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.

మోడ్రన్‌ లుక్‌లో నిస్సాన్‌ నయా మాగ్నైట్‌ లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Nissan Magnite Facelift Launched

మార్కెట్లోకి ఒకేరోజు రెండు కియా లగ్జరీ కార్లు- ధర, ఫీచర్లు ఇవే..! - Kia Cars Launched in India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.