దిల్లీ గల్లీల్లో రామోజీ- గొల్లపూడి ఫ్రెండ్‌షిప్ కహానీ! - Gollapudi Maruthi Rao Ramoji Rao Friendship - GOLLAPUDI MARUTHI RAO RAMOJI RAO FRIENDSHIP
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 2:37 PM IST
Gollapudi Maruthi Rao Ramoji Rao Friendship : ఈటీవీ అంటేనే ఇంటింటా వినోదాల పంట. అయితే ఈటీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమం విడాకులకు సిద్ధమైన జంటను కలిపిందని తెలుసా? ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావు ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈటీవీ వ్యవస్థాపకులు రామోజీ రావుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
అయితే ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) శనివారం తెల్లవారుజామున అస్తమయం చెందారు. ఆయన మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మరోవైపు రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ, పాత్రికేయ రంగానికి చెందిన ప్రముఖులు ఫిల్మ్ సిటీకి చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేసుకుని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా గొల్లపూడి మారుతి రావు, రామోజీరావు స్నేహం గురించి ఆసక్తి విషయాలు తెలుసుకోవాలంటే ఈ మొత్తం వీడియోను చూసేయండి మరి.