దేశంలో టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఫీవర్- భారత్ గెలవాలని ప్రత్యేక పూజలు, హోమాలు - T20 World Cup 2024 Final - T20 WORLD CUP 2024 FINAL
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/640-480-21823946-thumbnail-16x9-t20-world-cup.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Jun 29, 2024, 11:34 AM IST
ICC T20 World Cup 2024 Final Match : దేశవ్యాప్తంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా శనివారం జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనున్న నేపథ్యంలో, టీమ్ఇండియా గెలవాలని క్రికెట్ లవర్స్ పూజలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ప్రాంతంలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలని హారతి ఇచ్చారు. త్రివర్ణ పతాకం, టీమ్ఇండియా ప్రేయర్ల ఫొటోలు ప్రదర్శిస్తూ మేళతాళాలతో భజన చేశారు. ఇండియా గెలవాలని వారణాసిలో క్రికెట్ ఫ్యాన్స్ భారత్ క్రిటెక్ ఆటగాళ్ల ఫొటోలతో హోమం నిర్వహించారు. అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రికెట్ లవర్స్. మరోవైపు కర్ణాటక హుబ్బళ్లిలో ఇండియా గెలవాలంటూ చిన్నారుల నినాదాలు చేశారు. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ కళాకారుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. 8 అడుగుల రోహిత్ చిత్రాన్ని గీసి స్పెషల్ గ్రీటింగ్స్ తెలిపాడు యూపీ అమ్రోహకు చెందిన జుహైద్ ఖాన్ అనే కళాకారుడు.