LIVE : ఖమ్మంలో నటుడు వెంకటేశ్ ఎన్నికల ప్రచారం - Venkatesh Daughter Ashritha LIVE - VENKATESH DAUGHTER ASHRITHA LIVE
🎬 Watch Now: Feature Video


Published : May 7, 2024, 6:25 PM IST
|Updated : May 7, 2024, 7:29 PM IST
Hero Venkatesh Election Campaign in Khammam Live : ఖమ్మంలో నటుడు వెంకటేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. అపార్టుమెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు. మహిళలతో సరదాగా ఫొటోలు దిగుతూ కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. రఘురాం రెడ్డితో కలిసి ప్రచారానికి వెళ్తూ, ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో వెంకటేశ్‌కు రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యాడు. అలాగే ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిను వివాహం చేసుకున్నారు. ఆశ్రిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే కుకింగ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఆమె స్వయంగా ప్రొఫెషనల్ బేకర్. అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎవరైనా ఏదైనా సమాచారం అడిగితే యాక్టివ్‌గా ఉంటూ వాటికి సమాధానాలు చెబుతూ ఉంటారు.
Last Updated : May 7, 2024, 7:29 PM IST