తాగునీరే కాదు, వాడకానికీ కొనాల్సిందే- ఉరవకొండలో జనం అవస్థలు - Water Problem in Uravakonda - WATER PROBLEM IN URAVAKONDA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 12:35 PM IST
Drinking Water Problem in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గతంలో మూడ్రోజులకు ఓసారి వచ్చే కుళాయి నీరు ఇప్పుడు నెల రోజులకోసారి రావడం గగనమైపోయింది. నెల రోజులు దాటినా నీటి సరఫరాపై స్పష్టత లేదు. 20 కాలనీల్లోని 9 వేల గృహాల్లో 40 వేలకు పైగా జనాభా ఉంది. వీరికి సరపడా 5 వేల తాగునీటి కుళాయిలు ఉన్నా ఫలితం లేదు. నింబగల్లులో ట్యాంకులు ఎండిపోయి నీటి సరఫరా స్తంభించింది. కనీసం రోజుకు ఒక వీధికి కూడా నీటిని సరఫరా చేయడానికి అవకాశం లేకుండా పోయింది.
నీటి సమస్యపై గత ఏడాది అక్టోబరు నుంచే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రత్యక్షంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో పాటు అప్పటి జిల్లా కలెక్టరు దృష్టికి పదేపదే తీసుకుపోయారు. కానీ నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ఆర్‌డబ్ల్యూఎస్ యంత్రాంగం ముందస్తు ప్రణాళికను రూపొందించి, అమలు చేయడంలో విఫలమైంది. సమస్య పూర్తిగా జఠిలంగా మారి గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. నీటిని కొనుక్కుని తాగుతున్నామని చెబుతున్నారు. ఇక పల్లెల్లో తాగునీటి సమస్యను వారు మాట వరసకు కూడా పట్టించుకోవడం లేదు.